చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు బెల్లల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బోధన్ ఎంపీవో (MPO) వేణు విచ్చేయగా, గ్రామ సర్పంచ్ రామావత్ రాజు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రంజిత్, వార్డు సభ్యుడు రూప్ సింగ్, ప్రసాద్, లబ్ధిదారుడు (ఇంటి యజమాని) వసంతయ్య తదితరులు సంతోషంగా పాల్గొన్నారు.

