చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ సార్వజనిక్ గణేష్ కమిటీ లడ్డూ వేలంలో రాకాసిపేటకు చెందిన సాయిరాహుల్ అత్యధికంగా ₹5,11,000/- వేలం పాడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా నిర్వహించిన ఈ వేలం పాటలో లడ్డూను కైవసం చేసుకున్న సాయిరాహుల్కు ఉత్సవ కమిటీ నిర్వాహకులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

