చంటి ఛానల్, బోధన్: ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల గ్యాస్ కొరత వస్తుందనే పుకార్లతో బోధన్ ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరుతుండగా, చంటి ఛానల్ క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. గృహ వినియోగదారులకు (Domestic) ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాను మాత్రమే నిలిపివేసిందని, ఇళ్లలో వాడే సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని ఏజెన్సీ యజమానులు స్పష్టం చేశారు. అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలను వారు ఖండిస్తూ, ప్రజలు అనవసర ఆందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

