చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు (డంపింగ్ యార్డులు) ప్రస్తుతం అలంకారప్రాయంగా మారి నిరుపయోగంగా పడి ఉన్నాయి. తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో పక్కదారి పట్టింది; షెడ్లను వాడకుండా చెత్తను యథేచ్ఛగా దహనం చేస్తుండటంతో పర్యావరణ కాలుష్యంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య నిర్వహణపై పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా, స్థానిక పంచాయతీ కార్యదర్శులు వాటిని బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ షెడ్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


One Response
Not GOLD
Suspend them
Remove them
Transfer them
Take the Action IMMEDIATELY