Explore

Search

November 7, 2026 6:23 pm

​‘మహా బావర్చి’ రుచులకు భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ జి.పి. ఫల్గుణ ప్రశంసలు!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ప్రముఖ ‘మహా బావర్చి’ రెస్టారెంట్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ (TFA) గౌరవ కార్యదర్శి, ఏఐఎఫ్ఎఫ్ (AIFF) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జి.పి. ఫల్గుణ తన మిత్రులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రెస్టారెంట్ నిర్వాహకులు ఘన స్వాగతం పలకగా, హోటల్‌లోని పలు వంటకాలను రుచి చూసిన ఆయన ఆహార నాణ్యత, రుచులను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్