Explore

Search

November 7, 2026 6:23 pm

బోధన్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు: ‘రంగుల విషం’తో 05 హోటళ్ల సీజ్

చంటి ఛానల్,బోధన్: TG SAFE కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆహార భద్రతా అధికారి జి. నవిత బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా, రాకాసిపేట పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో లభ్యమైన 3.5 కిలోల పాడైన మయోనైస్, 10 కిలోల కుళ్లిన టమాటాలు, సింథటిక్ రంగులు కలిపిన చికెన్, జిలేబీలను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. తీవ్ర అపరిశుభ్రతతో పాటు FSSAI లైసెన్స్ లేకుండా నడుస్తున్న 5 ఆహార సంస్థలకు మూసివేత నోటీసులు జారీ చేస్తూ, లోపాలను సరిదిద్ది నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందే వరకు వ్యాపారాలు నిర్వహించరాదని అధికారి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్