Explore

Search

November 7, 2026 6:32 pm

నిజామాబాద్‌లో హోరాహోరీగా ‘ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026’

చంటి ఛానల్,నిజామాబాద్: నగరంలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC), జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో “ఎన్‌ఎస్‌సి – నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ 2026” పేరుతో భారీ టి-12 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ క్రీడలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 28 వరకు స్థానిక ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 1 లక్ష నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ. 50,000 అందజేయనున్నారు. కేవలం నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు మాత్రమే అనుమతి ఉన్న ఈ పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ. 5,000 ఎంట్రీ ఫీజుతో ఈ నెల 17వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం మొదటి 32 జట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 95332 56063 లేదా 95029 29737 నంబర్లను సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్