చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం, ఈ సంవత్సరం కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరియు రూ. 25,000/- నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు గట్టు హరికృష్ణ, అంబం గ్రామ సర్పంచ్ పరుష సుమన్, రంజిత్, కట్టర్ శ్రీకాంత్, వీరేశం, రాహుల్ మరియు ఇతరులు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణోత్సవం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

