Explore

Search

November 7, 2026 6:12 pm

రాజకీయాల్లో బంజారాలకు సమాన అవకాశాలు కల్పించాలి: జాదవ్ ప్రవీణ్ నాయక్ డిమాండ్

చంటి ఛానల్,బోధన్: నియోజకవర్గంలోని ఐదు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ల నియామకంలో ఒక్క స్థానం కూడా బంజారాలకు కేటాయించకపోవడం అన్యాయమని గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్) జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బోధన్‌లో మార్కెట్ కమిటీ, మున్సిపల్, సొసైటీ చైర్మన్ వంటి కీలక పదవులేవీ లంబాడీలకు దక్కలేదని, తమను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించి రాజకీయాల్లో గిరిజనులకు తగిన ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్