Explore

Search

November 7, 2026 6:22 pm

​”మేడే రోజున ఉపాధి పనులా?: అధికారులపై సీపీఐ నిప్పులు”

చంటి ఛానల్,బోధన్: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అంతటా సెలవు పాటిస్తుంటే, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో కార్మికులతో ఉపాధి హామీ పనులు చేయించడంపై సీపీఐ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మేడే రోజున కూడా కార్మికులకు విశ్రాంతి లేకుండా పని చేయించడంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీయగా, నిబంధనలు చూపాలని అధికారులు వితండవాదం చేయడంపై నాయకులు మండిపడ్డారు. పని ప్రదేశంలో కనీసం టెంట్లు, తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, కార్మికుల పట్ల ఈ వివక్ష తగదని సీపీఐ నాయకులు హనుమంతరావు, రాధాకృష్ణ ధ్వజమెత్తారు. నిబంధనలు అతిక్రమించి పనులు చేయించిన అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్