Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక: ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం (మే 13, 2026) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. తెలంగాణ మున్సిపాలిటీస్ రూల్స్ – 2020 ప్రకారం, మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులు (ఒకరు మహిళ), మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యుల (ఒకరు మహిళ) ఎంపిక కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. మే 7 నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియలో మొత్తం 35 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పరిపాలనా అనుభవం ఉన్న విభాగంలో 9 దరఖాస్తులు (6 పురుషులు, 3 మహిళలు) రాగా, మైనారిటీ వర్గాల విభాగంలో 26 దరఖాస్తులు (17 పురుషులు, 9 మహిళలు) అందినట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్