చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ వారి నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం సుమారు మూడు గంటల పాటు వినియోగదారులు ఎండలో వేచి చూసినా, దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ వారు కనీసం టెంట్ కూడా వేయించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బిఆర్ఎస్ కౌన్సిలర్లు ముషీర్ బాబా, గుమ్మల అశోక్ రెడ్డిలు అక్కడికి చేరుకుని వినియోగదారుల కష్టాలను చూసి చలించిపోయారు. వెంటనే ఏజెన్సీ వారితో మాట్లాడి, ఎండలో ఉన్న ప్రజల కోసం స్వయంగా టెంట్ వేయించి సమస్యను పరిష్కరించారు. ఏజెన్సీ వారు పట్టించుకోకపోయినా, బిఆర్ఎస్ నాయకులు స్పందించి సహాయం చేయడంతో వినియోగదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

