చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ఉషోదయ జూనియర్ & మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలోనే విశేష గుర్తింపు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతిభ కనబరిచిన టాపర్లకు శాలువాలు కప్పి మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఈ విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ సూర్యప్రకాష్ విద్యార్థుల పట్టుదలని కొనియాడగా, ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు దుష్యంత్, రమణి, సునీత,అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

