చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని క్రిసెంట్ హై స్కూల్ (CHS) ప్రాంగణంలో నేడు పండుగ వాతావరణం నెలకొంది. 2026 ఎస్.ఎస్.సి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా గౌరవించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులను పాఠశాల మేనేజ్మెంట్ పూలమాలలు,మిఠాయిలతో సత్కరించింది. విద్యార్థుల ప్రతి అడుగులోనూ అండగా నిలిచి, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులే నిజమైన ‘సైలెంట్ హీరోస్’ అని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కొనియాడింది. CHS విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయంలో కుటుంబ సభ్యుల త్యాగం,అంకితభావం ఎంతో కీలకమని, వారి సహకారం వల్లే పాఠశాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయని మేనేజ్మెంట్ పేర్కొంది.

