చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ కమిటీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సిద్ధించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత గ్యారంటీలతో ప్రజలను ఆగం చేస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముషీర్ బాబా, మొబీన్,అశోక్ రెడ్డి, నేతలు రవి శంకర్ గౌడ్, శంకర్ గౌడ్, డిష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

