Explore

Search

November 7, 2026 6:22 pm

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ

చంటి ఛానల్ ,బోధన్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పరీక్షలు జరుగుతున్న తీరును, విద్యార్థుల హాజరును నిశితంగా పరిశీలించిన కలెక్టర్.. కేంద్రంలో తాగునీరు, ప్రథమ చికిత్స, టాయిలెట్స్ వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని, పరీక్ష ముగిసిన వెంటనే ఆన్సర్ షీట్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్‌తో పాటు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్