చంటి ఛానల్,నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నిర్వహించిన ఆర్.ఎస్.ఎస్ (RSS) చీఫ్ బహిరంగ సభకు సంబంధించి ప్రోటోకాల్ విధులను అత్యంత సమర్థవంతంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు గాను రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో తహసీల్దార్‌ను కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శాలువాతో సన్మానించి ప్రశంసించారు. తన పనితీరును గుర్తించి గౌరవించినందుకు తహసీల్దార్ కలెక్టర్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

