Explore

Search

November 7, 2026 6:22 pm

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ కన్నుమూత.

చంటి ఛానల్ ,హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర రాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలో కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, ప్రస్తుత ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, రిజిస్ట్రార్‌గా సేవలందించి మంచి పేరు గడించిన సౌందర రాజన్, చిలుకూరు ఆలయ అభివృద్ధిలో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్