చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో బోనాల వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కరువు కాటకాలు లేకుండా రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈ పండుగను నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ లక్ష్మి శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు బోనాలు ఎత్తుకుని, ఆకట్టుకునే వివిధ రకాల వేషధారణలతో అందరినీ విశేషంగా అలరించారు.

