Explore

Search

November 7, 2026 7:16 pm

ఇసకాసురుల పాలిట ‘సింహస్వప్నం’ బోధన్ తహసిల్దార్ విఠల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండల తహసిల్దార్‌గా విఠల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ ఇసుక రవాణాపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. నిఖార్సైన వర్క్‌హాలిక్‌గా, అంకితభావం గల అధికారిగా పేరు తెచ్చుకున్న విఠల్.. అర్ధరాత్రి వేళల్లో సైతం సమాచారం అందడమే ఆలస్యం, రెవెన్యూ బృందంతో రంగంలోకి దిగిపోతున్నారు. పక్కా సమాచారంతో ఇసుక డంపింగ్‌లను సీజ్ చేయడం, అక్రమ టిప్పర్లు, ట్రాక్టర్లను పట్టుకుంటూ తన విధిని 100% బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. సమయపాలన లేకుండా, అలసట ఎరుగక శ్రమిస్తూ ఇసకాసురుల ఆట కట్టిస్తున్న తహసిల్దార్ విఠల్ పనితీరును, బాధ్యతాయుతమైన శైలిని చూసి స్థానిక ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్