Explore

Search

November 7, 2026 5:57 pm

బోధన్ గర్వకారణం: అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ పల్లవికి అరుదైన గౌరవం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవికి హైదరాబాద్ వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్మ, వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ శౌర్య పురస్కారాన్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న వారికి ఇచ్చే ఈ అవార్డుకు పల్లవి ఎంపికయ్యారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. చిన్నతనం నుంచే కరాటేలో శిక్షణ పొందిన పల్లవి, ఇప్పటివరకు మూడు గోల్డ్ మెడల్స్, ఒక కాంస్య పతకంతో పాటు 2022లో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం ఆమె పలు పాఠశాలల్లో, బోధన్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కరాటే మాస్టర్‌గా సేవలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్