Explore

Search

November 7, 2026 6:12 pm

​”బోధన్ రైతుల ఆవేదన: కొనుగోలు కేంద్రాలు లేక క్వింటాలుకు ₹400 నష్టం!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 87,516 ఎకరాల్లో సాగైన పంట ద్వారా 2.43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు ₹2,400 పైగా ఉండగా, ప్రైవేటు వ్యాపారులు కేవలం ₹2,000 నుండి ₹2,100 కే కొనుగోలు చేస్తూ, క్వింటాలుకు ₹400 వరకు రైతులను నష్టపరుస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఏప్రిల్ మొదటి వారంలోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తమను ఆదుకోవాలని బోధన్ నియోజకవర్గ  ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్