చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వి.ఆర్. దేశాయ్ 58 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్ (54 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా పి. సమ్మయ్య (53 ఓట్లు), జాయింట్ సెక్రటరీగా ఎండి. వాజీద్ హుస్సేన్ (53 ఓట్లు), కోశాధికారిగా రమేష్. బి (69 ఓట్లు), మరియు లైబ్రరీ సెక్రటరీగా ధర్మరాజు (71 ఓట్లు) ఎన్నికయ్యారు. వీరితో పాటు కార్యనిర్వాహక కమిటీ (E.C) సభ్యులుగా శంకర్. టి (72), ఇంద్రకరణ్ (69), లక్ష్మణ్. కె (62), రాఘవేందర్. వై (59), సుంకరి గోపి (53), అబ్దుల్ మజీద్ (53), మరియు సూర్య ప్రకాష్ (52) విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో విజేతలను అధికారికంగా ప్రకటించగా, తోటి న్యాయవాదులు నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

