చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో పార్సెల్ సర్వీస్‌లో డెలివరీ కాకుండా మిగిలిపోయిన పాత వస్తువుల బహిరంగ వేలాన్ని ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బస్ స్టాండ్‌లోని స్టేషన్ మేనేజర్ రూమ్ వద్ద ఈ వేలం పాట జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు సకాలంలో హాజరై, తమకు అవసరమైన వస్తువులను పాడుకుని కొనుగోలు చేయవచ్చునని డిపో మేనేజర్ సూచించారు.

