Explore

Search

November 7, 2026 7:20 pm

బోధన్ కోర్టు సిబ్బందిపై దాడి: నిందితుడికి రిమాండ్

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ కోర్టు ఆవరణలో విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడిన నిజామాబాద్‌కు చెందిన సర్దార్ సింగ్ చౌహాన్‌కు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ రోజు ఉదయం కోర్టు సిబ్బంది నరేందర్ తన వాహనాన్ని పక్కకు తీయాలని కోరినందుకు ఆగ్రహించిన సర్దార్ సింగ్, ఆయనపై దాడి చేసి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బోధన్ ఎస్హెచ్వో (SHO) కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని మేజిస్ట్రేట్ సాయి శివ ముందు హాజరుపరచగా, ఆయన నిందితుడికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్