చంటి ఛానల్,బోధన్: ఆడిట్ లోపాలు, నిధుల వ్యత్యాసం వంటి ఆర్థిక అవకతవకల కారణంగా నిజామాబాద్ జిల్లా జాడిజమాల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) పాత పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో ఎం.ఎం. సుందర్ రాజు ఛైర్‌పర్సన్‌గా, మరో 11 మంది సభ్యులతో నూతన పర్సన్-ఇన్-ఛార్జ్ (PIC) కమిటీని నియమిస్తూ వ్యవసాయ, సహకార శాఖ జీవో నెం. 720 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు బాధ్యతల్లో కొనసాగనుంది.

