Explore

Search

November 7, 2026 6:11 pm

కల్దుర్కిలో ఘనంగా అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ధర్మపరాయణురాలు, ప్రజాహిత పాలకురాలిగా పేరుగాంచిన అహల్యాబాయి.. దేశవ్యాప్తంగా ఆలయాలు, ఘాట్లు, ధర్మశాలల నిర్మాణానికి చేసిన విశేష కృషిని, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఆమె ఆదర్శవంతమైన జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ వేడుకలలో బోధన్ కురుమ నాయకులు రావుభ గంగాధర్, దేవూరావు, మేడి రవి, కల్దుర్కి కురుమ సంఘం అధ్యక్షుడు సిరిగిరి రామ్, కార్యదర్శి గౌరు గోండా అశోక్, అలాగే ఇతర సభ్యులు మహేష్, శ్రీనివాస్, పేరజి, సాయి గోండా, నాగ్ గోండ, శేఖర్, శివ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్