Explore

Search

November 7, 2026 6:23 pm

ఘనంగా ‘ఆచార్యదేవోభవ 2026’.. 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

చంటి ఛానల్,బోధన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధన్ ఇందూరు హైస్కూల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో ‘ఆచార్యదేవోభవ 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పార్శి అశోక్, బోధన్ ఎంఈవో నాగయ్య, సాలూర ఎంఈవో రాజీ మంజూష ముఖ్య అతిథులుగా హాజరై, డివిజన్‌లోని సుమారు 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు కొడాలి కిశోర్, గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు ముస్త్యాల హరికృష్ణ, సెక్రెటరీ మంతె సురేష్, కోశాధికారి కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు మిద్దెల రాజు, సెక్రెటరీ అనిల్ కుమార్, కోశాధికారి సురేష్ గౌడ్ తో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్