చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి; స్థానికంగా ఓ ప్రధాన పార్టీకి వెన్నెముకలా వ్యవహరిస్తున్న ఇద్దరు అత్యంత కీలకమైన కౌన్సిలర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న విశ్వసనీయ సమాచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తితో సదరు నేతలు పక్క చూపులు చూస్తూ, ఇతర పార్టీలతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలతో ఆ పార్టీ క్యాడర్లో తీవ్ర అలజడి మొదలైంది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న ఈ ఇద్దరు నేతలు గనుక చేజారితే పట్టణంలో ఆ పార్టీకి కోలుకోలేని భారీ దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతుండగా, కనీసం ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నష్టనివారణ చర్యలతో ఆ నాయకులను కాపాడుకుంటుందా లేక చేతులారా కీలక వికెట్లను జారవిడుచుకుంటుందా అన్నది ఇప్పుడు బోధన్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

