చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ సహకార సంఘం ప్రాంగణంలో అధ్యక్షుడు దొనకంటి రాజారెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. సంఘ పరిధిలోని రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని, నూతన కమిటీని ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని తీర్మానించారు. నానో యూరియా, నానో డీఏపీల ఫలితాలను సంఘం కేటాయించే ఎకరం భూమిలో డెమో ద్వారా చూపించిన తర్వాతే రైతులకు సిఫార్సు చేయాలని, వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సంఘ కార్యదర్శి షేక్ బాబా, రైతులు పాల్గొన్నారు.

