చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ కొత్త బస్టాండ్లోని ‘విజయ డెయిరీ’ స్టాల్లో పాలకు బదులు గుట్కాలు, సిగరెట్లు యథేచ్ఛగా అమ్ముతూ యువతను వ్యసనాలకు బానిసలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కళ్లెదుటే జరుగుతున్నా RTC అధికారులంతా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని కూర్చోవడం విడ్డూరంగా ఉంది; బహుశా ఆ సిగరెట్ల పొగ దట్టంగా కమ్మేసి అధికారుల కళ్లకు లోపల జరిగే ఈ దందా కనిపించడం లేదేమో! ఇప్పటికైనా సంబంధిత డిపో మేనేజర్, అధికారులు నిద్ర వీడి వెంటనే ఆ స్టాల్ లైసెన్స్ రద్దు చేయాలని, లేదంటే ఆ బోర్డు తీసేసి ‘విజయ గుట్కా స్టాల్’ అని మార్చుకుంటే సరిపోతుందని జనం తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు.

