చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఊర పండగను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ), గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని దేవాలయాల్లో ఈ వేడుకలను కన్నుల పండువగా జరిపారు. ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, వీడీసీ అధ్యక్షులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో పాటు విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొని పండుగను విజయవంతం చేశారు.

