Explore

Search

November 7, 2026 6:32 pm

బోధన్‌లో ఆరే కటికె సంఘం బోనాలు.. స్వయంగా బోనమెత్తిన ఆర్డీవో!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఆరె కటికె సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ డివిజన్ ఆర్డీవో విజయ కుమారి, సాధారణ మహిళలతో పాటు స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆరే కటికె సంఘం ప్రతినిధులు గంగారాం చౌదరి, రాజులాల్, మహేష్, రాజేందర్, రాజేశ్వర్, గంగా లాల్, మహేష్ మహిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్