చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీలో రూ. 3.67 కోట్ల ప్రజాధనానికి అధికారులు ఆధారాలు చూపడం లేదు. ఆడిట్ అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. గడువులోగా సరైన లెక్కలు చూపకపోతే కఠిన చర్యలు తప్పవని ఆడిట్ శాఖ ఏవో అమృత్ తీవ్రంగా హెచ్చరించారు.

