Explore

Search

November 7, 2026 6:30 pm

అనిల్ టాకీస్ – బెల్లాల్ దారి: ప్రాణసంకటంగా మారిన ప్రయాణం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని అనిల్ టాకీస్ నుండి బెల్లాల్ వెళ్లే మార్గం ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై పేరుకుపోయిన భారీ బురద కారణంగా ద్విచక్ర వాహనదారులు తరచూ స్కిడ్ అవుతూ అదుపుతప్పి పడిపోతున్నారు. గతంలో చేపట్టిన అరకొర పనుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని, వర్షాలకు రోడ్డు పూర్తిగా చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మున్సిపల్, రైల్వే అధికారులు సమన్వయంతో స్పందించి, తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టకుండా, నాణ్యమైన పనులతో ఈ మార్గాన్ని సురక్షితంగా మార్చాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్