Explore

Search

November 7, 2026 6:31 pm

“సీఐ గారూ.. కళ్లు తెరిచేదెప్పుడు? నర్సాపూర్ మృత్యుకూపానికి అంతెప్పుడు?”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ శివారులోని నర్సాపూర్ గేటు వద్ద హైవేను ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కల్లుబట్టిపై ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉండాలనే కనీస నిబంధనను కూడా పాటించకుండా, హైవే పక్కనే అక్రమంగా కొనసాగుతున్న ఈ కల్లుబట్టి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ దందాపై ఎక్సైజ్ సీఐ వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఇక్కడి ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగక తప్పదని హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్