చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ (11-20 వార్డుల) సభలు మున్సిపల్, పోలీస్ అధికారుల సమక్షంలో జరిగాయి. ఈ సభలో పట్టణ సుందరీకరణ, తడి-పొడి చెత్త నిర్వహణ, ఓటరు నమోదు (SIR) ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడాలని, పెరుగుతున్న సైబర్ మోసాలు (ఓటీపీల చోరీ, డిజిటల్ అరెస్ట్) పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

