Explore

Search

November 7, 2026 6:10 pm

యూరియా కోసం నిరసన.. సొసైటీకి తాళం వేసిన జాడి జమాల్పూర్ రైతులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ సొసైటీ వద్ద యూరియా అందడం లేదంటూ రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్‌లైన్ పంపిణీ పద్ధతిని పూర్తిగా తిరస్కరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని రైతులను ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. అధికారుల వివరణతో ఏమాత్రం సంతృప్తి చెందని రైతులు, నిరసనగా సొసైటీకి తాళం వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్