Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్ కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మే 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కట్పల్లి నాగేష్ రెడ్డితో సంప్రదించి ఆమోదించిన ఈ జాబితా ప్రకారం.. బోధన్ మండలానికి డి. నాగేశ్వర్ రావు, సాలూరకు భూచల్వార్ రవి, ఎడపల్లికి పులి శ్రీనివాస్, నవీపేట్‌కు శ్రీనివాస్ గౌడ్, రెంజల్‌కు మోబిన్ ఖాన్, అలాగే బోధన్ టౌన్ అధ్యక్షుడిగా అంకు దామోదర్‌ లను తక్షణమే అమల్లోకి వచ్చేలా నియమించారు. నూతనంగా నియమితులైన వీరంతా అట్టడుగు స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేయాలని ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్