చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆటోనగర్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. మసీదు సమీపంలోని ఓ వృద్ధ దంపతుల ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఆకతాయిలు వరుసగా రాళ్లదాడికి పాల్పడుతూ నరకం చూపిస్తున్నారు. చివరకు ప్రశ్నించిన వృద్ధుడిపైనే భౌతిక దాడికి తెగబడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, పోలీసులు తక్షణమే స్పందించి ఆ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

