Explore

Search

November 7, 2026 6:31 pm

గోమాత నోటికాడి బువ్వను లాగేసిన మంటలు – కన్నీరుమున్నీరవుతున్న గోభక్తులు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఏక చక్రవేశ్వర గోశాలలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం గోభక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పుణ్యఫలం కోసం, గోమాతల ఆకలి తీర్చాలనే సత్సంకల్పంతో భక్తులు తమ శక్తివంచన లేకుండా విరాళంగా అందజేసిన సుమారు 8 వేల గడ్డి కట్టలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతవ్వడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. గోసేవలో భాగంగా భక్తులు తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నప్పటికీ, దానం చేసిన వస్తువులను, ముఖ్యంగా గోగ్రాసాన్ని భద్రపరచడంలో గోశాల నిర్వాహకుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏవైనప్పటికీ, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అటువంటి ఆస్తులను సంరక్షించాల్సిన పూర్తి బాధ్యత గోశాల యాజమాన్యానిదేనని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్