చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ, మండల వ్యాప్తంగా 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ కాలనీలో AIKMS మండల అధ్యక్షులు ఎల్. చిన్న పర్వయ్య, మున్సిపాలిటీ కార్యాలయం వద్ద IFTU జిల్లా నాయకులు ఎస్. సుధాకర్, అనిల్ టాకీస్ చౌరస్తాలో CPI (ML) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పిరోళ్ళ పోశెట్టి, మరియు ఊట్ పల్లి గ్రామంలో AIKMS జిల్లా నాయకులు ఎస్కే రషీద్ గారు ఎర్రజెండాలను ఎగురవేశారు. వాడవాడలా ఎగిరిన ఎర్రజెండాలతో కార్మిక ఐక్యతను చాటుతూ, హక్కుల సాధనకై పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

