చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ డివిజన్ డీ.ఆర్.ఎం సంతోష్ కుమార్ వర్మ ఉన్నత స్థాయి తనిఖీ నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యాలు,భద్రతా అంశాలను సమీక్షించిన ఆయన, బోధన్‌ను కీలక లాజిస్టిక్స్ నోడ్‌గా మార్చేందుకు గూడ్స్ యార్డ్ పునర్నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు. స్థానిక పరిశ్రమలు, వ్యవసాయ వాణిజ్యానికి తోడ్పడేలా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని తెలుపుతూ, వివిధ విభాగాల సీనియర్ అధికారులతో కలిసి మౌలిక సదుపాయాల బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.

