Explore

Search

November 7, 2026 6:11 pm

అరైవ్ అలైవ్ – 2026: రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులకు అవగాహన

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంలో సీపీ పి. సాయి చైతన్య ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు (302) సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, యువత డ్రగ్స్,ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలో భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్