చంటి ఛానల్, సాలూర: ’చంటి ఛానల్’ కథనానికి స్పందించిన ఇంచార్జ్ ఎంపీఓ అరవింద్, సోమవారం ఫతేపూర్ గ్రామ డంపింగ్ యార్డును సందర్శించారు. షెడ్లను వినియోగంలోకి తెచ్చి, తడి-పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్తను తగలబెడితే పర్యావరణానికి హాని కలుగుతుందని, నిబంధనలు అతిక్రమిస్తే సెక్రటరీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు.

