చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో ఉషోదయ డిగ్రీ,మహిళా కళాశాలల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, తల్లిదండ్రులకు మరియు విద్యాసంస్థకు పేరు తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. ఇదే వేదికపై విద్యార్థులతో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రమాణం చేయించారు. కళాశాల చైర్మన్ సూర్య ప్రకాష్, డైరెక్టర్లు దుష్యంత్, సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

