చంటి ఛానల్,బోధన్: ”గుడికి వెళ్తే దేవుడు కనిపిస్తాడో లేదో తెలీదు కానీ, వాట్సాప్ స్టేటస్ చూస్తే మాత్రం యువతలో భక్తి పొంగిపొర్లుతోంది! ఫోన్లో భక్తి పాటలు, డీజే రీల్స్‌తో ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని ఫీలయ్యే మా ‘డిజిటల్ పులులు’.. తీరా వీధిలోకి వచ్చి ర్యాలీలో పాల్గొనమంటే మాత్రం ‘ఎండ ఎక్కువగా ఉంది బ్రో’, ‘అంత దూరం ఎవరు నడుస్తారులే’ అంటూ ఫోన్ చాటున దాక్కుంటున్నారు. ఫోన్ స్క్రీన్ మీద బాటలు తిప్పడానికి ఉన్న ఓపిక, ధర్మం కోసం నాలుగు అడుగులు వేయడానికి లేదా ఐక్యత చాటడానికి లేకుండా పోతోంది. తమ మత మూలాల కంటే ‘లైకులు, వ్యూస్’ ముఖ్యం అనుకుంటున్న ఈ బ్యాచ్‌కి, భవిష్యత్తులో మన సంస్కృతి ఫోన్ గ్యాలరీలకే పరిమితమైతే తప్ప బుద్ధి వచ్చేలా లేదు. స్టేటస్‌లో పెట్టే బిల్డప్ ఫోటోలు కాదు నాయనా.. ర్యాలీలో కనిపించే మీ ‘యువ రక్తమే’ రేపటి ధర్మానికి బలం! మరి రానున్న ర్యాలీల్లోనైనా ఈ ‘కీబోర్డ్ వారియర్స్’ బయటకు వచ్చి తమ సత్తా చాటుతారో లేక చార్జింగ్ పెట్టుకుని ఇంట్లోనే కూర్చుంటారో చూడాలి!”

