Explore

Search

November 7, 2026 6:20 pm

శాంతముఖి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు.. ఘనంగా అన్నదానం

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని శ్రీ శాంతముఖి హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారి కృపతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తుల కోసం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందలాది మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్