చంటి ఛానల్,బోధన్: పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌వో వి. వెంకటనారాయణ హెచ్చరించారు. పాత బస్టాండ్ వద్ద ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ గొడవకు దిగిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపరచగా, వారికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే, గోశాల ఏరియాలో మట్కా నిర్వహిస్తున్న షైక్ రసూల్‌కు రూ. 5000 జరిమానాతో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష, అదే ప్రాంతానికి చెందిన అయ్యుబ్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను రూ. 5000 జరిమానా, వారం రోజుల జైలు శిక్ష పడినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

