చంటి ఛానల్, నిజామాబాద్: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 24వ వార్డును ఎస్టీ (జనరల్)కు, 10, 13, 16 వార్డులను ఎస్సీ వర్గానికి కేటాయించారు. బీసీ వర్గానికి మొత్తం 15 వార్డులు కేటాయించగా, అందులో 4, 7, 8, 14, 19, 23, 35 వార్డులు మహిళలకు, మిగిలిన 2, 5, 6, 9, 12, 22, 26, 34 వార్డులు జనరల్‌కు కేటాయించారు. అన్-రిజర్వ్‌డ్ (UR) కింద ఉన్న 19 వార్డులలో 1, 3, 11, 20, 28, 29, 31, 32, 33, 36, 38 వార్డులను మహిళలకు కేటాయించగా, 15, 17, 18, 21, 25, 27, 30, 37 వార్డులు జనరల్‌కు దక్కాయి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఈ రిజర్వేషన్ల జాబితాను అధికారికంగా వెల్లడించారు.

